ఏపీ టెన్త్ ఎగ్జామ్స్.. నేడో, రేపో కీలక నిర్ణయం..!

ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా?... లేదా? అన్న అంశంపై సందిగ్ద‌త నెల‌కుంది. ఈ విష‌యంపై ఇవాళ, రేప‌ట్లో అధికారులు కీల‌క నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఏపీ టెన్త్ ఎగ్జామ్స్.. నేడో, రేపో కీలక నిర్ణయం..!
Ram Naramaneni

|

Jun 20, 2020 | 8:57 AM

ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారా?… లేదా? అన్న అంశంపై సందిగ్ద‌త నెల‌కుంది. ఈ విష‌యంపై ఇవాళ, రేప‌ట్లో అధికారులు కీల‌క నిర్ణ‌యం వెల్ల‌డించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ విష‌యంపై ఎలా ముందుకెళ్లాలన్న‌ది గురు, శుక్ర వారాల్లో నిర్వహించిన మీటింగ్స్ లో అధికారులు చ‌ర్చించారు. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స్టూడెంట్స్ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌టం క‌రెక్ట్ కాద‌ని, ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చెయ్యాల‌ని ప్ర‌తిప‌క్షాలు చెబ‌తున్నాయి.

మ‌రోవైపు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో స‌హా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేశాయి. స్కూల్లో జ‌రిపిన ప‌రీక్షల్లో విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం, హాజ‌రు ఆధారంగా రిజ‌ల్ట్స్ ఇవ్వాలని నిర్ణయించాయి. ఏపీలోనూ ప్రతిక్షాలతో పాటు విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఇదే త‌ర‌హా విధానం అమ‌లు చేయాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ విద్యార్థులు 6,30,804 మంది ఉన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu