పృథ్వీకి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఏకంగా..
వైసీపీ నేత, కమెడియన్ పృథ్వీకి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. టీటీడీ భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్‌పర్సన్‌గా పృథ్వీని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పృథ్వీకి సీఎం వైఎస్ జగన్ సమాచారం ఇవ్వగా.. త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా టీడీపీ హయాంలో ఈ ఛానెల్ చైర్‌పర్సన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఉండేవారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి […]
వైసీపీ నేత, కమెడియన్ పృథ్వీకి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. టీటీడీ భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్‌పర్సన్‌గా పృథ్వీని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పృథ్వీకి సీఎం వైఎస్ జగన్ సమాచారం ఇవ్వగా.. త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా టీడీపీ హయాంలో ఈ ఛానెల్ చైర్‌పర్సన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఉండేవారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉండగా.. త్వరలో ఎస్వీబీసీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు పృథ్వీ.
అయితే సినిమాల్లో కమెడియన్‌గా మంచి పేరు సాధించిన పృథ్వీ.. ఆ తరువాత వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసే సమయంలో ఆయన వెంట కూడా నడిచిన పృథ్వీ.. ఎన్నికల సమయంలో పార్టీ తరుఫున ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయనకు నామినేటెడ్ పదవిని అప్పగించింది.