ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు
జీవితఖైదు పడిన 53 మంది మహిళల విడుదలకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27....
యావజ్జీవ శిక్ష పడిన 53 మంది మహిళల విడుదలకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27, విశాఖ నుంచి ఇద్దరు, నెల్లూరు నుంచి ఐదుగురు ఖైదీల ముందస్తు విడుదలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 53 మంది మహిళా ఖైదీలకు జీవితఖైదు నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ వీరి విడుదలకు సిఫార్సు చేసింది.
అయితే మహిళా ఖైదీల ముందస్తు రిలీజ్‌కు గవర్నమెంట్ కొన్ని కండీషన్స్ పెట్టింది. విడుదలయ్యే ఖైదీలు…. 50 వేల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విడుదలైన తర్వాత కూడా శిక్షా కాలం పూర్తయ్యే వరకు ప్రతి మూడు నెలలకోసారి స్థానిక పోలీసు స్టేషన్‌లో అధికారి ముందు హాజరు కావాలని తెలిపారు. మరోసారి నేరానికి పాల్పడితే తక్షణమే అరెస్ట్ చేసి ముందస్తు విడుదల రద్దు చేస్తామని గవర్నమెంట్ స్పష్టం చేసింది.
Also Read :
నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం
స్టార్ హీరోలు కూడా చేయలేని రిస్క్ చేస్తోన్న కియారా, మరి అమ్మడు అదరగొడుతుందా..?