అసలు మండలిలో ఏం జరిగిందో.. వీడియో లీక్ చేసిన నారా లోకేష్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి అందులోనూ… అసెంబ్లీ, మండలిలో రాజకీయంగా మరింత రచ్చ జరుగుతోంది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని, దానితో నష్టమే కానీ లాభం లేదని అంటోంది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బుధవారం మండలిలో ఏంజరిగిందో అని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఓ వీడియోను ఫేస్ బుక్‌లో విడుదల […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి అందులోనూ… అసెంబ్లీ, మండలిలో రాజకీయంగా మరింత రచ్చ జరుగుతోంది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని, దానితో నష్టమే కానీ లాభం లేదని అంటోంది. మరోవైపు శాసన మండలిలో వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బుధవారం మండలిలో ఏంజరిగిందో అని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఓ వీడియోను ఫేస్ బుక్‌లో విడుదల చేశారు. వీడియోతో పాటు రెండు పేజీల లేఖ కూడా రాశారు లోకేష్.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. దేవాలయంలాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగలేఖ విడుదల చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో వైకాపా వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభజనను ఎంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ టెలికాస్ట్ ఆపివేసి, ఏపీ ఎంపీలపై దాడిచేసి మూకబలంతో బిల్లు తెచ్చారో! అదేవిధమైన దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చోటుచేసుకున్నాయి. ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలకు పాలకపక్షం పాల్పడటం ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. మండలిలో సభ్యులు కాని మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై దాడులకు దిగారు. మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంటర్‌నెట్ సేవలు ఆపేశారు. కరెంటు కట్ చేశారు.
https://www.facebook.com/naralokesh/videos/1038720486506229/
ఇటువంటి సమయంలో గౌరవ అధ్యక్షస్థానంలో ఉన్న షరీఫ్ గారి వైపు ఒక్కసారిగా వైకాపాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. చైర్‌ని చుట్టుముట్టారు. చైర్మన్ నీ అంతుచూస్తామని బెదిరించారు. ఇతర టీడీపీ సభ్యులపైనా మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మండలి సభ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీకరించకూడదు. కానీ వైకాపా మంత్రులు తమ పంతం నెగ్గించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం అంటూ హెచ్చరిస్తుండటంతో చైర్మన్ గారు, ఇతర ఎమ్మెల్సీల భద్రత కోసం తప్పనిసరై వీడియో తీశాను. విలువలు, విశ్వసనీయత అంటూ లెక్చర్లు దంచే సీఎం జగన్, వైకాపా మంత్రులు మండలిలో ఎలా ప్రవర్తించారో ప్రజలు ముందుంచే ప్రయత్నమే ఇది’. అంటూ రెండు పేజీల లేఖతో పాటు వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.