AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. హైదరాబాద్ హై-అలెర్ట్!

ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని ఉహాన్ నగరంలో మొదటిసారిగా ఈ వైరస్‌ను కనిపెట్టగా.. ఇప్పుడు ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా మారి.. అన్ని చోట్లకు వేగంగా పాకుతుండటంతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఇకపోతే కేరళకు చెందిన ఓ నర్సుకు ఈ వైరస్ సోకిందని వార్తలు వస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ […]

కలవరపెడుతున్న కరోనా వైరస్‌.. హైదరాబాద్ హై-అలెర్ట్!
Ravi Kiran
|

Updated on: Jan 24, 2020 | 2:15 PM

Share

ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని ఉహాన్ నగరంలో మొదటిసారిగా ఈ వైరస్‌ను కనిపెట్టగా.. ఇప్పుడు ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్‌గా మారి.. అన్ని చోట్లకు వేగంగా పాకుతుండటంతో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఇకపోతే కేరళకు చెందిన ఓ నర్సుకు ఈ వైరస్ సోకిందని వార్తలు వస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది.

దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. చైనా, హాంగ్‌‌‌‌‌కాంగ్ నుంచి వచ్చే ప్రయాణీకులను పరీక్షించడానికి ప్రత్యేక స్కానర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా హొంగ్‌కాంగ్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి విమాన రాకపోకలు లేవు. అయితే ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత హొంగ్‌కాంగ్ నుంచి ఓ విమానం వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. విమానాశ్రయంలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే తక్షణం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తరలించి రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

  1. ఎప్పటికప్పుడు చేతులను సబ్బులతో కడుక్కోవాలి
  2. చేతులను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు
  3. దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోండి
  4. పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోండి
Follow Us
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!
మాది ప్రజల పక్షం.. అభివృద్ధే ముఖ్యం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ
మాది ప్రజల పక్షం.. అభివృద్ధే ముఖ్యం.. టీవీ9 సదస్సులో ప్రధాని మోదీ
భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచింది
భారతదేశం ఒక ఉదాహరణగా నిలిచింది