శభాష్, పులివెందుల ఎస్ఐకి డీజీపీ అభినందనలు
కడప జిల్లా పులివెందుల ఎస్ఐ గోపినాథ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కడప జిల్లా పులివెందుల ఎస్ఐ గోపినాథ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పట్టణంలో అక్రమ మద్యం తరలిస్తున్న వాహనం ఢీకొట్టినా, మొక్కవోని ధైర్యంతో ప్రాణాలకు తెగించి నిందితులను పట్టుకున్న ఎస్ఐ గోపినాథ్ రెడ్డిని డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అభినందించారు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్ఐ గోపినాథ్ రెడ్డికి డీజీపీ చేతుల మీదుగా ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపాలని డీజీపీ గౌతం సవాంగ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి అన్బురాజన్ కు సమాచారం అందింది.

Also Read :
