నూతన్ నాయుడు కేసులో అరెస్టులు షురూ

ఆంధ్రప్రదేశ్ లో దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:12 pm, Sat, 29 August 20
నూతన్ నాయుడు కేసులో అరెస్టులు షురూ

ఆంధ్రప్రదేశ్ లో దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం కేసులో అరెస్టులు షురూ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్‌ కుమార్‌ సిన్హా చెప్పారు. అరెస్ట్‌ అయిన వారిలో నూతన్‌ నాయుడు భార్య మధు ప్రియను ఏ-1గా, ఇంకా మధు ప్రియ ఇంట్లో పని చేసే వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. వీరందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు సీపీ తెలిపారు. ఐఫోన్‌ చోరీ చేశాడనే ఆరోపణతో శ్రీకాంత్ ని పిలిచి ఇంట్లోనే శిరోముండనం చేశారని సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించారు. శ్రీకాంత్‌పై దాడి, గుండు చేస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో నూతన్‌ నాయుడు ప్రమేయం పైన ఆరా తీస్తున్నామన్నారు. అటు, ఘటన జరిగిన నూతన్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.