ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది.కొత్తగా రాష్ట్రంలో 58,519 మందికి కరోనా టెస్టులు చేయగా.. 326 మందికి కోవిడ్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,612కు చేరింది. గురవారం కరోనాతో ఎవరూ మరణించలేదు. ఏపీలో ఇప్పటివరకు 7108 కరోనా మరణాలు నమోదవుతాయి. కొత్తగా కరోనా నుంచి 350 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ శుక్రవారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో వివరించింది. మొత్తం రికవరీల సంఖ్య 8,72,266కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 3,238 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,84,085 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.
Also Read :
Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం
Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..