బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.24వేలు..వారికి జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్…

అస‌లే ఆర్థిక సంక్షోభం..ఆపై కరోనా కాలం. అయినా స‌రే ఏపీ స‌ర్కార్ సంక్షోమం విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వ‌రుసగా రెండో ఏడాది కూడా ప‌లు సంక్షేమ‌ ప‌థ‌కాల అమ‌లు దిశ‌గా అడుగులు ముందుకు వేస్తున్నారు.

బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.24వేలు..వారికి జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Jun 18, 2020 | 11:03 AM

అస‌లే ఆర్థిక సంక్షోభం..ఆపై కరోనా కాలం. అయినా స‌రే ఏపీ స‌ర్కార్ సంక్షోమం విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వ‌రుసగా రెండో ఏడాది కూడా ప‌లు సంక్షేమ‌ ప‌థ‌కాల అమ‌లు దిశ‌గా అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం ద్వారా పేద నేత‌న్న‌ల‌కు ఆర్థికసాయం అందించేందుకు రంగం సిద్ద‌మైంది. ఈ నెల 20న సీఎం జ‌గ‌న్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధిపొంద‌గిన‌ అర్హుల‌ జాబితాను గ్రామ‌, వార్డు వాలంటీర్ల ద్వారా ప్ర‌భుత్వం సేక‌రించింది. ప‌థకానికి సంబంధించి నిధుల కూడా విడుద‌ల‌య్యాయి.

గతేడాది అర్హత ఉన్నా కూడా అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ నేతన్న నేస్తం ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారు. వారికి కూడా సాయం అందించేందుకు ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపింది. పవర్‌లూమ్స్ వ‌చ్చిన ప్ర‌స్తుత సంక్షోభ స‌మయంలో కూడా కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి..ముడి సరుకు, ఇతర అవసరాల కోసం గ‌వ‌ర్న‌మెంట్ ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందిస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 17న పథకం ప్రారంభించాల్సి ఉన్నా అసెంబ్లీ సెష‌న్ కారణంగా ఈ నెల 20కు వాయిదా పడింది. సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌గానే.. ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు డ‌బ్బు జమకానుంది.