కొత్త ఐటీ పాలసీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
విశాఖలో ఐటీ హైఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

విశాఖలో ఐటీ హైఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఐటీ పాలసీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విశాఖలో ఐటీ హైఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీ వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా విశాఖలో యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబొటిక్స్ వంటి అత్యాధునిక అంశాలల్లో విద్యార్థలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇక్కడి యూనివర్సిటీలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు.
అలాగే, స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైతే ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారిలో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఐటీ కంపెనీలకు తగినవిధంగా ఆంధ్రప్రదేవ్ నుంచి మానవ వనరులు సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఏటా కనీసం 2 వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇచ్చేలే చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో శిక్షణ పొందడం ప్రతి విద్యార్థి ప్రతిష్టాత్మకంగా భావించాలన్నారు. ఐటీ హైఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా అయా కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సూచించి ముఖ్యమంత్రి..
