కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 6:14 pm, Tue, 3 November 20
కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,30,731కు చేరింది.  మరో 15 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. . తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,734 మంది వైరస్‌తో మృతి చెందారు.  3,700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8 లక్షలు దాటింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Also Read :

Breaking : చిత్తూరు జిల్లాలో మినీ బస్సు బోల్తా, ముగ్గురు మృతి

వరుసకు కూతురిపై అత్యచారయత్నం.. ప్రతిఘటించడంతో భార్యతో కలిసి హత్య..