AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈనెలాఖరుతో ముగియనున్న ఏపీ సీఎస్‌ పదవికాలం.. ఘనంగా సత్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌తోపాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు.

ఈనెలాఖరుతో ముగియనున్న ఏపీ సీఎస్‌ పదవికాలం.. ఘనంగా సత్కరించిన సీఎం జగన్
Balaraju Goud
|

Updated on: Dec 18, 2020 | 3:22 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌తోపాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు. ఈనెల అఖరితో నీలం సాహ్ని పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఘనంగా సన్మానించారు. కాగా 2019 నవంబర్‌ 14న ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయ్యారు. సాహ్ని 2018 నుంచి ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహించారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో నీలం సాహ్ని చేసిన సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించారు.