రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి..ఏపీ సర్కార్‌ను డిమాండ్ చేసిన సోమువీర్రాజు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త వాతావరణం మధ్యే.. పుష్కరఘాట్లను పరిశీలించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్న సోమువీర్రాజు..
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్త వాతావరణం మధ్యే.. పుష్కరఘాట్లను పరిశీలించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్న సోమువీర్రాజు.. తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ నుంచి మాధవరం వరకు బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి.
భారీ పోలీసు బందోబస్తు మధ్య పుష్కరఘాట్లను పరిశీలించారు సోమువీర్రాజు. కర్నాటక అతిథి గృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు… మంత్రాలయం ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. పుష్కరఘాట్లు నాసిరకంగా నిర్మించారని విమర్శించారు.
రాయలసీమ సాగునీటికోసం గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం రెండేళ్లలో ఏంచేసిందో శ్వేతపత్రాన్ని విడుదలచేయాలని తర్వాత మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు సోమువీర్రాజు. రాయలసీమకోసం బీజేపీ పోరాటంలో చిత్తశుద్ధి ఉందన్నారు సోమువీర్రాజు. తమకో అవకాశం ఇస్తే కచ్చితంగా చేసి చూపిస్తామంటున్నారు.
సోమువీర్రాజు మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సొంత గ్రామమైన కాచపురం, రాంపురంలో పర్యటించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేవలం ఐదు వాహనాలకు అనుమతించారు. పర్యటన ముగిసేదాకా ముందుజాగ్రత్తగా భారీగా మోహరించారు.