రైతుల నిరసనకు మద్దతు, కెనడా ట్రిప్ వదులుకుని సింఘు బోర్డర్ చేరుకున్న సెలూన్ యజమాని, ఇదీ సేవే అంటున్న ఠాకూర్
రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ సింఘు సరిహద్దుల్లో 20 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా హర్యానాకు చెందిన ఓ సెలూన్ యజమాని ఈ బోర్డర్ చేరుకున్నాడు. తన భార్యతో..

రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ సింఘు సరిహద్దుల్లో 20 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా హర్యానాకు చెందిన ఓ సెలూన్ యజమాని ఈ బోర్డర్ చేరుకున్నాడు. తన భార్యతో కలిసి కెనడా వెళ్లే అవకాశం వఛ్చి నప్పటికీ దాన్ని వదులుకుని నేను రైతుల పక్షానే అంటున్నాడు.హర్యానాలో కురుక్షేత్ర వాసి అయిన లాభ్ సింగ్ ఠాకూర్ అనే ఈయన ఈ సరిహద్దుల్లో అన్నదాతలకు ఉచితంగా హెయిర్ కట్, హెడ్ మాసేజ్, ఫేస్ మాసేజ్ వంటివి చేస్తున్నాడు. రైతులనుంచి తను డబ్బులుఆశించడం లేదని, వారి నిరసనలు తనను కదిలించాయని ఠాకూర్ చెబుతున్నాడు. తన టీమ్ రోజుకు సగటున వంద మంది నుంచి 150 మంది వరకు ఫ్రీ సర్వీసు చేస్తున్నట్టు తెలిపాడు.
ట్రాక్టర్ ట్రాలీలోనే ఈయన సరంజామా అంతా ఉంటుంది. కురుక్షేత్రలో తన కస్టమర్లంతా చాలావరకు రైతులేనని, ఠాకూర్ చెప్పాడు. అయితే ఇంత సేవలోనూ ఈయనను చిన్న కారణమొకటి బాధిస్తోంది. అది తన భార్య పుట్టినరోజును కెనడాలో సెలబ్రేట్ చేసుకోవాలను కున్నామని, కానీ అది నెరవేరలేదని ఠాకూర్ తెలిపాడు. ఆ ట్రిప్ ను రద్దు చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని తన భార్య కూడా సమర్థించిందని ఆయన వెల్లడించాడు. మా టీమ్ కొన్ని రోజులుగా రోజుకు 15 గంటలు పని చేస్తోంది అని ఆయన చెప్పాడు.అన్నట్టు పిల్లలు కూడా ఈయన సెలూన్ ముందు బారులు తీరడం విశేషం.
Free Salon sewa at #FarmersProtests ! #Singhu border pic.twitter.com/uNF2XjQwXV
— Ramandeep Singh Mann (@ramanmann1974) December 19, 2020



