బిగ్‌బాస్‌లో ఈ విషయం గమనించారా…? ఆ పని చేసి ట్రోఫీలు కొట్టిన విన్నర్లు… ఇంతకీ ఆ పని ఏంటంటే…?

టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్ షో ఒక సంచలనం. కేవలం మనుషులు... వారు చూపే ఎమోషన్లు, ఆడే ఆటలు, పాడే పాటలు, తీసుకునే నిర్ణయాలు... ఇలా ఒక సెలబ్రెటీని సామాన్యునిగా మార్చి 100 రోజులు ఒక ఇంట్లో ఉంచే ప్రక్రియే బిగ్ బాస్.

  • Gandu Raju
  • Publish Date - 11:24 am, Wed, 16 December 20
బిగ్‌బాస్‌లో ఈ విషయం గమనించారా...? ఆ పని చేసి ట్రోఫీలు కొట్టిన విన్నర్లు... ఇంతకీ ఆ పని ఏంటంటే...?

టెలివిజన్ చరిత్రలో బిగ్‌బాస్ షో ఒక సంచలనం. కేవలం మనుషులు వారు చూపే ఎమోషన్లు, ఆడే ఆటలు, పాడే పాటలు, తీసుకునే నిర్ణయాలు… ఇలా ఒక సెలబ్రెటీని సామాన్యునిగా మార్చి 100 రోజులు ఒక ఇంట్లో ఉంచే ప్రక్రియే బిగ్ బాస్. ఈ క్రమంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ప్రదర్శించే ఆట తీరు, మాట తీరు, నడవడిక, నైపుణ్యం వారిని ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తాయి. చివరకు విజేతలను చేస్తాయి. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 నడుస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు విజేతలు బిగ్‌బాస్ టైటిల్‌ను గెలిచారు. మరి కొందరు టాప్ 5లో నిలిచారు. అయితే గెలిచిన వారిలో, తుది పోరులో నిలిచిన కొందరిలో ఒక లక్షణం కామన్ గా ఉంది. అదేంటంటే… కోపం. అవును‌ కోపమే… బిగ్‌బాస్ తెలుగు సీజన్ విజేతల్లో కామన్‌గా కనిపించిన పాయింట్ కోపం. ఆ కోపమే వారిని విజేతలుగా నిలిపింది.

ఇలా కోప్పడే ఒక‌రు ట్రోఫీని తీసుకెళ్లారు

బిగ్‌బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ. అయితే శివ బాలాజీ బిగ్‌బాస్ హౌస్‌లో చాలా కోపాన్ని ప్రదర్శించేవాడని, అలా కోప్పడే ఒక‌రు బిగ్‌బాస్ 1 ట్రోఫీని ప‌ట్టుకెళ్లార‌ని హ‌రితేజ శివ‌బాలాజీని గుర్తు చేసింది. ఇక రెండో సీజన్‌లో కౌశల్, తనీష్ ఇద్దరు బాగా కోపాన్ని ప్రదర్శించే వారు. పలు సందర్భాల్లో కౌశల్, తనీష్ మధ్య తీవ్ర స్థాయిలో గొడలు కూడా జరిగాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి వరకు వెళ్లాయి. ఇక కౌశల్‌ను ఇతర ఇంటి సభ్యులు టార్గెట్ చేసిన సందర్భాలు, అతడు వారిపై కోపంగా స్పందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు.

 

బిగ్‌బాస్ సీజన్ 3 విషయానికి వస్తే అలీ రేజా… హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లోకే అత్యంత కోపాన్ని ప్రదర్శించిన ఇంటి సభ్యుడిగా అలి నిలుస్తాడు. సీజన్ 3లో ఇంటి సభ్యులతో టాస్క్‌ల సందర్భంగా అలీ రేజా చాలా అగ్రెసివ్‌గా ఆడేవాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు చాలా మంది అలిని కోపం కారణంగా నామినెట్ చేసేవారు. అయితే ఆ సీజన్‌లో అలీ రేజా టాప్ 5లో నిలిచాడు. ఇక ప్రస్తుత సీజన్ 4లో కోపిష్టి అంటే సోహైల్ అని ఇంటిసభ్యులే ఒప్పుకుంటున్నారు. ఇటీవల ఎపిసోడ్‌లో కనిపించిన మాజీలు సైతం సోహైల్‌కి కోపం ఎక్కువే అని అన్నారు. కాగా, సోహైల్ ఇప్పుడు టాప్ 5లో సైతం ఉన్నాడు. టైటిల్ రేసులో ముందున్నాడు. అయితే అరియానాతో గొడవ కారణంగా కొంత వెనుకబడ్డాడు. కానీ, అతడు టైటిల్ కానీ, రన్నరప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. సో బిగ్‌బాస్ తెలుగు సీజన్ల ప్రకారం అగ్రెసివ్‌నెస్ కంటెస్టెంట్లకు కలిసి వస్తోందన్న మాట….