ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,160 పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మ‌ృతి

కొత్తగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,160 పాజిటివ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మ‌ృతి
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 21, 2020 | 6:10 PM

ap corona report : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,160 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,61,092కి చేరింది. ఇందులో 14,770 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,39,395 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు నిన్న వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,927కు చేరుకుంది. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 95.43 లక్షల సాంపిల్స్‌ను పరీక్షించారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందగా అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందారు. అలాగే కడప, కృష్ణా జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,765 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 43, చిత్తూరు 148, తూర్పుగోదావరి 165, గుంటూరు 121, కడప 70, కృష్ణా 189, కర్నూలు 23, నెల్లూరు 60, ప్రకాశం 66, శ్రీకాకుళం 46, విశాఖపట్నం 67, విజయనగరం 42, పశ్చిమ గోదావరి 120 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,490 కి చేరింది.