ప్రభుదేవా రెండో పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది, రాజు సుందరం ఏం చెప్పారంటే

ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు సర్కులేట్ అవుతున్నాయి.

ప్రభుదేవా రెండో పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది, రాజు సుందరం ఏం చెప్పారంటే

ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. ఆయన తన మేనకోడలితో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారని  కొందరు రాయగా.. ఫిజియోథెరపిస్ట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు మరికొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం స్పందించారు. ‘మీ వద్దే సమాచారం అంతా ఉంది. ప్రభుదేవా పెళ్లి పట్ల మా కుటుంబ సభ్యులంతా చాలా హ్యాపీగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు.

ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్ హిమనిని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నారట. డ్యాన్స్‌ చేస్తున్న క్రమంలో ప్రభుదేవా కాలికి, వెన్నెముకకు తరచూ స్వల్ప గాయాలు అవుతుండేవి. ఆయనకు హిమని ట్రీట్మెంట్ అందించేవారట. రెండు నెలలు వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. కాగా కోవిడ్ నేపథ్యంలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో పెళ్లి జరిగిందట.  ఈ వార్తలపై స్పందించిన రాజుసుందరం ” ప్రభుదేవా 1995లో రామలతను పెళ్లి చేసుకున్నారు. దాదాపు 16 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత విబేధాల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు హిమనిని రెండో పెళ్లి చేసుకున్నారు” అని చెప్పారు.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్