గ్రేటర్ పోరులో జోరుగా ఆకర్ష్.. అరే బై.. పార్టీ మారితే చెప్పే పోతానంటున్న మండలి మాజీ ఛైర్మెన్ స్వామిగౌడ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఒకవైపు జోరందుకుంటుంటే ఇంకో వైపు పార్టీ మారే నేతల సంఖ్య పెరుగుతోంది.. అదే సమయంలో పేరున్న నేతలకు గాలమేసే ప్రాసెస్‌ను...

  • Rajesh Sharma
  • Publish Date - 6:29 pm, Sat, 21 November 20
గ్రేటర్ పోరులో జోరుగా ఆకర్ష్.. అరే బై.. పార్టీ మారితే చెప్పే పోతానంటున్న మండలి మాజీ ఛైర్మెన్ స్వామిగౌడ్

Political migrations increasing in Greater: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఒకవైపు జోరందుకుంటుంటే ఇంకో వైపు పార్టీ మారే నేతల సంఖ్య పెరుగుతోంది.. అదే సమయంలో పేరున్న నేతలకు గాలమేసే ప్రాసెస్‌ను ప్రధాన పార్టీలు కొనసాగిస్తూనే వున్నాయి. పేరున్న నాయకులకు గాలమేసే పనిలో కాస్త దూకుడు చూపుతోంది కమలం పార్టీ. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు ప్రసన్న చేసుకున్న బీజేపీ నేతలు.. శనివారం తెలంగాణ శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు.

శుక్రవారం సర్వే సత్యనారాయణను కలిసిన తర్వాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖరారు కాగా శనివారం మాత్రం స్వామిగౌడ్ నుంచి వారి నిర్దిష్టమైన హామీ లభించనట్లు సమాచారం. దానికితోడు స్వామి గౌడ్ కూడా ‘‘ అరే పార్టీ మారితే చెప్పే పోతా.. ఏదీ సీక్రెట్‌గా చేయను ’’ అంటూ తనదైన శైలిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే విషయంపై స్పష్టమైన కామెంటేదీ ఆయన చేయలేదు. చిరకాల మిత్రులను కలుసుకున్నానని మాత్రం చెప్పుకొచ్చారు.

అయితే.. స్వామి గౌడ్‌ని కలిసిన బీజేపీ నేతలు మాత్రం ఆయనతో రాజకీయాలు మాట్లాడామని, సరైన సమయంలో సరైన ప్రకటన చేస్తామని చెప్పుకుంటున్నారు. అయితే, గత 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు టీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని భావిస్తున్న స్వామిగౌడ్ కూసింత అలక బూనిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం కాస్త నోరు విప్పి మళ్ళీ మౌనం వహించిన స్వామిగౌడ్‌ను బీజేపీలోకి తీసుకువచ్చేలా కమల నాథులు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే ఆయన్ను కలిసినట్లు సమాచారం.

ALSO READ: తమ్మినేనికి తప్పిన ముప్పు.. రోడ్ యాక్సిడెంట్‌లో తృటిలో ఎస్కేప్