AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రంలో చిక్కుపోయిన నలుగురు మత్స్యకారులు

బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఘటన చోటుచేసుకుంది.

సముద్రంలో చిక్కుపోయిన నలుగురు మత్స్యకారులు
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 11:46 AM

Share

బతుకుతెరువు కోసం బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఘటన చోటుచేసుకుంది.

యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ శివారు అమీనాబాద్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు చేపల వేట వృత్తిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వంకా సజీవ్‌, దుర్గాప్రసాద్‌, వీరన్న, అమినాబాదుకు చెందిన పిక్కి కాశీయ్య ఈ నెల 10న బోటుపై బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భైరవపాలెం వద్ద బోటు ఇంజన్‌ పాడైనట్లు కుటుంబసభ్యలకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో మిగతా మత్స్యకారులు వేరే బోటుపై వారిని తీసుకురావడానికి వెళ్లగా ఆ ప్రాంతంలో వారి ఆచూకీ దొరకలేదు. గురువారం మరో రెండు బోట్లపై వేరే చోట్ల గాలించారు. రెండు రోజులుగా మూడు బోట్లపై గాలిస్తున్నా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వెతకడానికి వెళ్లిన వారు సమీప రేవుల్లో ఉండిపోయారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. సెల్ ఫోన్‌ సిగ్నల్ కూడా పనిచేయలేదు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.. దీంతో మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
ఒక్కమాట చెప్పకుండా టీమిండియా నుంచి తీసేశారు
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే..
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్‌ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుంది?
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!