మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 11:46 AM

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు లారీలు బియ్యం, బత్తాయిల లోడ్‌తో వెళ్తున్నాయి. అయితే రెండు లారీలు ఎదురెదురుగా ఢి కొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే లారీల డ్రైవర్లు ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసు అధికారి తెలిపారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu