AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాడిపత్రిలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

అనంతరపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

తాడిపత్రిలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు
Balaraju Goud
|

Updated on: Sep 15, 2020 | 9:34 AM

Share

అనంతరపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. క్రూయిజర్‌ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాడిపత్రి శివారులో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్ వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా డ్రైవర్‌తో సహా ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తిరుచానూరులో ఓ ఆధ్యాత్మిక గురువు మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజూమున ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరంతా తాడిపత్రి వాసులేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసలు.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Follow Us