AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత ‘అమృతం’గా ద్వితీయం ఉండేనా.?

అమృతం… కామెడీ సీరియల్‌గా మొదలైన దీని ప్రయాణం ఒక ప్రభంజనంలా ముగిసిందని చెప్పాలి.. టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతూ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే అత్యంత అద్భుతమైన సీరియల్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ ఒక ఎమోషన్. ఇప్పటికీ కూడా దీనికి కోసం యూట్యూబ్‌లో వెతుకుతున్నారంటే.. దానితో ఉన్న ఎటాచ్‌మెంట్ అలాంటిది. డబుల్ మీనింగ్ డైలాగులు, సాగతీత, బోర్ అనేవి లేకుండా.. జంధ్యాల తరహా హాస్యంతో అమృతం అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఎందరో నటులు, […]

అంత 'అమృతం'గా ద్వితీయం ఉండేనా.?
Ravi Kiran
|

Updated on: Jan 17, 2020 | 10:46 AM

Share

అమృతం… కామెడీ సీరియల్‌గా మొదలైన దీని ప్రయాణం ఒక ప్రభంజనంలా ముగిసిందని చెప్పాలి.. టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతూ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే అత్యంత అద్భుతమైన సీరియల్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఈ సీరియల్ ఒక ఎమోషన్. ఇప్పటికీ కూడా దీనికి కోసం యూట్యూబ్‌లో వెతుకుతున్నారంటే.. దానితో ఉన్న ఎటాచ్‌మెంట్ అలాంటిది. డబుల్ మీనింగ్ డైలాగులు, సాగతీత, బోర్ అనేవి లేకుండా.. జంధ్యాల తరహా హాస్యంతో అమృతం అందరిని కడుపుబ్బా నవ్వించింది.

ఎందరో నటులు, దర్శకులు సైతం ఈ సీరియల్ ద్వారానే టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ సీరియల్ సుమారు ఎనిమిది సంవత్సరాలు సూపర్ సక్సస్‌ఫుల్‌గా దూసుకుపోయింది. అమృతం, అంజి, సర్వం, అప్పాజీ క్యారెక్టర్స్ మన మనసులకు హత్తుకునే విధంగా ఉంటాయి. అటు యూట్యూబ్‌లో కూడా ఈ సీరియల్‌కు విశేష ఆదరణ లభించింది. ఒక్కో ఎపిసోడ్‌కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ప్రస్తుతం జీ5 యాప్‌ ద్వారా అందుబాటులో ఉన్న ఈ ‘అమృతం’కు త్వరలోనే సీజన్ 2 రాబోతోంది.

దీన్ని ‘అమృతం ద్వితీయం’ అనే పేరుతో రూపొందించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉండగా.. ఈ ఏడాది చివరికల్లా ఆన్ ఎయిర్ తీసుకెళ్లాలని యూనిట్ భావిస్తోందని సమాచారం. ప్రముఖ ఛానల్ జీ టీవీలో ఇది ప్రసారమవుతుందని తెలుస్తోంది. ఇక గతంలో ఉన్న నాలుగు క్యారెక్టర్లు ఆధారంగానే ఈ కథ  కొనసాగుతుందట. మరి ఆ పాత్రలకు ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?