కరోనా ప్యాకేజ్ కోసం కాంగ్రెస్ కు బైడెన్ విజ్ఞప్తి, వైరస్‌ తీవ్రత ఉన్నప్పటికీ ఫుల్ జోష్ లో అమెరికా క్రిస్మస్‌ వేడుకలు

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించేందుకు 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని...

  • Venkata Narayana
  • Publish Date - 5:36 am, Sun, 6 December 20
కరోనా ప్యాకేజ్ కోసం కాంగ్రెస్ కు బైడెన్ విజ్ఞప్తి, వైరస్‌ తీవ్రత ఉన్నప్పటికీ ఫుల్ జోష్ లో అమెరికా క్రిస్మస్‌ వేడుకలు

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించేందుకు 900 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.. వైరస్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు, వ్యాపారులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారాయన.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు బైడెన్‌. క‌రోనా టీకా అందుబాటులోకి వ‌స్తే, ఆ టీకాను తీసుకోవాల‌ని అమెరిక‌న్లపై వ‌త్తిడి చేయ‌బోమ‌ని బైడెన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా తీవ్రత నేపథ్యంలో జనవరి 20వ తేదీన జరిగే తన ప్రమాణ స్వీకార వేడుక వర్చువల్‌గా జరిగే అవకాశం ఉందని తెలిపారు బైడెన్‌. కాగా, కరోనా వైరస్‌ తీవ్రత ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఎంతో సంబరంగా సాగుతున్నాయి. న్యూయార్క్‌ మొదలు మాస్కో, వాటికన్‌, బెత్లెహామ్‌ తదితర నగరాల్లో సందడిగా మారాయి.. క్రిస్మస్‌ ట్రీల అలంకరణ, ప్రార్థనలు, షాపింగ్‌ సందడి మొదలైంది. భవనాలు, వ్యాపార సముదాయాలు, వీధులు, పార్కులు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి.