UFO Video: భూమిపైకి వ‌చ్చిన ఏలియ‌న్స్ యూఎఫ్‌వోలు..? వైర‌ల్ అవుతోన్న అమెరికాకు చెందిన రాడార్ వీడియో..

UFO Video: ఈ అనంత విశ్వంలో మ‌నిషి ఒంట‌రి కాదా.? ఇంత పెద్ద విశ్వంలో ఏదో ఒక చోట గ్ర‌హాంత‌ర వాసులు ఉండే ఉంటారా.? ఈ ప్ర‌శ్న ఎన్నో ఏళ్ల నుంచి త‌లెత్తుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో అప్పుడ‌ప్పుడు భూమిపైకి వ‌స్తున్న‌ట్లు క‌నిపించే కొన్ని..

UFO Video: భూమిపైకి వ‌చ్చిన ఏలియ‌న్స్ యూఎఫ్‌వోలు..? వైర‌ల్ అవుతోన్న అమెరికాకు చెందిన రాడార్ వీడియో..
Imaginary Photo
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2021 | 7:08 AM

UFO Video: ఈ అనంత విశ్వంలో మ‌నిషి ఒంట‌రి కాదా.? ఇంత పెద్ద విశ్వంలో ఏదో ఒక చోట గ్ర‌హాంత‌ర వాసులు ఉండే ఉంటారా.? ఈ ప్ర‌శ్న ఎన్నో ఏళ్ల నుంచి త‌లెత్తుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో అప్పుడ‌ప్పుడు భూమిపైకి వ‌స్తున్న‌ట్లు క‌నిపించే కొన్ని ఫ్లయింగ్ సాస‌ర్ల‌ను పోలిన వ‌స్తువులు (యూఎఫ్‌వో) ఏలియ‌న్స్ ఉనికి నిజ‌మేన‌ని వ‌స్తోన్న వార్త‌ల‌కు బ‌లానికి చేకూరుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా అమెరికా రాడ‌ర్ చిత్రీకరించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. అమెరికాకు చెందిన డ్యాక్యుమెంట‌రీ ఫిలిమ్ ద‌ర్శ‌కుడు జెరీమీ కార్బెల్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయ‌న ట్వీట్ చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. కాలిఫోర్నియాలోని శాన్‌ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో ఈ ఘటన జరిగిందని కార్బెల్ ట్వీట్ చేశారు. ఇక ఈ వీడియో ఫుటేజ్.. నిజమైందేన‌ని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. యుద్ధ‌నౌక‌ను చుట్టుముట్టిన యూఎఫ్‌వోలు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్‌ తెలిపారు. కొద్ది సేప‌టి త‌ర్వాత‌ రాడార్‌ తెరపై నుంచి అవి అదృశ్యమైనట్లు ఆయ‌న‌ వివరించారు. రాడార్‌ పరిధికి అందకుండా అవి వెళ్లిపోయి ఉంటాయని ఆయ‌న‌ తెలిపారు. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కే ప‌రిమితం అయిన గ్ర‌హాంత‌ర వాసులు నిజంగానే మ‌నుషుల‌ను క‌లిసే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయా? తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాలి.

జెర్మీ కార్బెల్ ట్వీట్ చేసిన వీడియో..

Also Read: Chitragupta Swamy Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? ప్రత్యేకత ఏమిటి..?

Lakshadweep: లక్షద్వీప్ లో స్థానికుల నిరసనలకు మద్దతుగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్న విపక్షాలు

Petrol Diesel Price Today: భ‌గ్గుమంటోన్న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు.. ఏపీలో కొన్ని చోట్ల‌ సెంచ‌రీ కొట్టిన పెట్రోల్‌..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?