సుశాంత్‌ను మీరే చంపేశారు..! అంబులెన్స్ డ్రైవర్లకు బెదిరింపులు

సుశాంత్‌ను మీరే చంపేశారు..! అంబులెన్స్ డ్రైవర్లకు బెదిరింపులు

ఆసుప‌త్రికి తీసుకెళ్ళే స‌మ‌యంలో సుశాంత్ బ్ర‌తికే ఉన్నాడు, ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపేశారు అంటూ ఫోన్ చేస్తున్నారని అంటున్నారు. దేవుడు మిమ్మ‌ల్ని తప్ప‌క శిక్షిస్తాడు అంటూ..

Sanjay Kasula

|

Aug 05, 2020 | 5:33 PM

బాలీవుడ్‌కు కుదిపేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మ‌ృతి.. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్లను తాకింది. సుశాంత్ భౌతిక కాయంను ముంబై రెసిడెన్స్ నుండి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన అంబులైన్స్ డ్రైవ‌ర్లకి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్స్ చేసి బెదిరింపుల‌కి దిగుతున్నారట.

ఆసుప‌త్రికి తీసుకెళ్ళే స‌మ‌యంలో సుశాంత్ బ్ర‌తికే ఉన్నాడు, ఆ త‌ర్వాత గొంతు నులిమి చంపేశారు అంటూ ఫోన్ చేస్తున్నారని అంటున్నారు. దేవుడు మిమ్మ‌ల్ని తప్ప‌క శిక్షిస్తాడు అంటూ కాల‌ర్స్ మాట్లాడుతున్నార‌ని అంబులెన్స్ డ్రైవ‌ర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ కాల్స్ కూడా తనకు వ‌చ్చాయ‌ని అంబులెన్స్ డ్రైవ‌ర్స్ చెబుతున్నారు.

సుశాంత్‌ని ఆసుపత్రికి తీసుకెళ్ళే స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్స్ అంబులెన్స్ ఫోటోలు తీయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారాయి. కాగా, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిన విష‌యం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu