జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు బెయిల్ : కానీ !

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఎట్ట‌కేల‌కు ఊరట లభించింది. జిల్లా కోర్టు ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది.

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు బెయిల్ : కానీ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2020 | 4:56 PM

BS-III vehicles scam : టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఎట్ట‌కేల‌కు ఊరట లభించింది. జిల్లా కోర్టు ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది. సంబంధిత ప‌త్రాలు సమ‌ర్పించిన అనంత‌రం గురువారం కడప జిల్లా జైలు నుంచి వీరు రిలీజ‌య్యే ఉన్నట్లు స‌మాచారం. వీరికి 3 కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఇద్దరిపై ప‌లు స్టేష‌న్ల‌లో కేసులు నమోదు అవ్వ‌డ‌వంతో.. బెయిల్‌పై విడుద‌ల‌య్యే అంశంపై సందిగ్ధ‌త నెల‌కుంది.  జిల్లా కోర్టు ఏయే కేసులు విష‌యంలో బెయిల్ ఇచ్చింది. వారి విడుద‌ల అవుతారా లేదా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే ఫేక్ ఇన్సూరెన్స్ పేప‌ర్స్ తయారు చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వీరిద్ద‌ర్ని అరెస్ట్ చేసిన పోలీసులు..అనంత‌రం మెజిస్ట్రేట్ ఆదేశాల‌తో అనంతరం కడప జిల్లాకు తరలించారు. ఆ త‌ర్వాత‌ పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. తాజాగా బెయిల్ ల‌భించింది.

Also Read :  సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్