పాకిస్తాన్ చర్య హాస్యాస్పదం, భారత్ ఆగ్రహం
జమ్మూ కాశ్మీర్, సియాచిన్, లడాఖ్, సన్ క్రీక్ తదితర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్ ను భారత ప్రభుత్వం ఖండించింది. ఇది వారి రాజకీయ..
జమ్మూ కాశ్మీర్, సియాచిన్, లడాఖ్, సన్ క్రీక్ తదితర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన కొత్త పొలిటికల్ మ్యాప్ ను భారత ప్రభుత్వం ఖండించింది. ఇది వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదం ఇచ్చిన ప్రోత్సాహంతో చేసిన ప్రాదేశిక దురాక్రమణ ఇది అని ప్రభుత్వం దుయ్యబట్టింది. ఈ హాస్యాస్పద చర్యలకు చట్టబధ్ధత లేదని, అంతర్జాతీయ విశ్వసనీయత అంతకన్నా లేదని ఓ ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు. గుజరాత్ లోని జునాగఢ్, మానవధర్ జిల్లాలను కూడా పాక్ తన కొత్త మ్యాప్ లో పేర్కొనడం మరీ విడ్డూరంగా ఉందని పాక్ కు మాజీ రాయబారి రాఘవన్ అన్నారు.
అటు-ఈ మ్యాప్ ను తమ దేశంలోని స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలలో ప్రవేశపెడతామని, సిలబస్ లలో కూడా ప్రస్తావిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఆయన అన్నారు.