AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరుకు రవాణాపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్

కరోనా లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజా రవాణా నిలిచిపోవడంతో సరుకు రవాణాపై దృష్టి సారించారు అధికారులు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్టీసీ కార్గో సేవలు అందించేందుకు ఫ్లాన్ చేశారు.

సరుకు రవాణాపై ఆర్టీసీ స్పెషల్ ఫోకస్
Balaraju Goud
|

Updated on: Aug 17, 2020 | 4:21 PM

Share

కరోనా లాక్ డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజా రవాణా నిలిచిపోవడంతో సరుకు రవాణాపై దృష్టి సారించారు అధికారులు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్టీసీ కార్గో సేవలు అందించేందుకు ఫ్లాన్ చేశారు. ఈమేరకు మరో వారం రోజుల్లో ఒప్పందం కుదరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తొలి దఫా చర్చలు ముగిశాయని ఆఫీసర్లు చెప్పారు.దీంతో ఆయా సంస్థల అన్ని రకాల వస్తువులను కార్గోలో వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ రవాణా చేయనుంది. రిలయన్స్‌, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డీమార్ట్ తోనూ చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఈ చర్చలు కొలిక్కి రాగానే ఈ సంస్థలతోనూ ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకొని, సరుకు రవాణా చేయనుంది. ఇప్పటికే అనేక ప్రైవేట్‌ సంస్థలకు ఆర్టీసీ కార్గో సర్వీసులు అందిస్తోంది.

కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీ బస్సుల ఎక్కేందుకు జనం పెద్దగా ఇష్టపడకపోవడంతో ఇలాంటి టికెట్టేతర ఆదాయంపై మేనేజ్‌మెంట్‌ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 19 నుంచి కార్గో, పార్సిల్‌, కొరియర్‌‌ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది. ఇప్ప టికే ఆర్టీసీ బస్సుల్లో పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులకు సంబంధించి రేట్లు ప్రకటించారు. ఇక సరుకు రవాణా ఛార్జీలను కూడా కుదించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది ఆర్టీసీ. ఆర్టీసీలో ఆల్టర్నేటివ్ ఆదాయం కోసం తీసుకొచ్చిన కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసులు క్లిక్‌ అయినట్లుగా ఆఫీసర్లు భావిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.10 లక్షల ఆదాయమే లక్ష్యంగా అధికారులు సరుకు రవాణాను వేగవంతం చేశారు. రోజుకు రూ. 7.5 లక్షల దాకా రెవెన్యూ వస్తోంది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ. 2.5 కోట్ల దాకా రెవెన్యూ వచ్చిందని అధికారులు తెలిపారు. త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ తదితర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతామంటున్నారు అధికారులు.

కార్గో సేవలను విస్తరించడంలో భాగంగా ఇంటర్‌ స్టేట్‌ ఏజెన్సీలను ఆర్టీసీ తీసుకురానుంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై తదితర సిటీలకు ఏజెంట్లను పెట్టనుంది. ప్రతి ఆర్డర్‌లో ఏజెంట్‌కు 10 శాతం కమీషన్‌ ఇస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మండలాల్లో ఏజెంట్లను ఆర్టీసీ నియమించింది. మరికొన్ని చోట్ల ఏజెంట్లను నియమించనుంది ఆర్టీసీ. అయితే, త్వరలోనే కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్ట్ పోస్టును క్రియేట్ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.