జగన్ కాళ్లు పట్టుకొని బతికిపోయారు

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య మాటల తూటాలు పేలాయి...

జగన్ కాళ్లు పట్టుకొని బతికిపోయారు
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 02, 2020 | 6:12 PM

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య మాటల తూటాలు పేలాయి. దివంగతనేత వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు ఒక వైపు పోటాపోటీగా జరుగగా అదే రీతిలో వాగ్భాణాలూ వదులుకున్నాయి ఇరువర్గాలు. కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ మాట్లాడుతూ, చీరాలకు స్వేచ్ఛను ఇస్తామని వాగ్దానం చేశామని, ఇక్కడ గతంలో మాదిరి దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడాలంటే కుదరదని.. చూస్తూ ఊరుకోబోమని పరోక్షంగా ఆమంచిని టార్గెట్ చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా..? అంటూ ఫైరయ్యారు. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారని హాట్ కామెంట్ చేశారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.