వేడి గాడ్పుల మధ్య ప్రాక్టీసు చేయడం కష్టమేః పాంటింగ్
ఐపీఎల్ 2020 సీజన్ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి.. దుబాయ్‌కు చేరుకున్న జట్లు ప్రాక్టీసును కూడా మొదలు పెట్టాయి.. అసలే ఎడారి దేశం! ఆపై వేడి! అక్కడ ప్రాక్టీసు చేయడం ఒకింత కష్టమే! దీన్ని గమనించే ఢిల్లీ కేపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ టీమ్ మెంబర్స్‌కు తగు సూచనలు చేస్తున్నాడు.
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ కోసం అన్ని జట్లు సంసిద్ధమవుతున్నాయి.. దుబాయ్‌కు చేరుకున్న జట్లు ప్రాక్టీసును కూడా మొదలు పెట్టాయి.. అసలే ఎడారి దేశం! ఆపై వేడి! అక్కడ ప్రాక్టీసు చేయడం ఒకింత కష్టమే! దీన్ని గమనించే ఢిల్లీ కేపిటల్స్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ టీమ్ మెంబర్స్‌కు తగు సూచనలు చేస్తున్నాడు. ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ప్రాక్టీసు చేయడం మంచిది కాదంటున్నాడు పాంటింగ్. ఓ సెషన్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తర్వాతి సెషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నామన్నాడు. శిబిరంలో తక్కువ మంది ప్లేయర్లు ఉండటంతో ప్రాక్టీసు కూడా జాగ్రత్తగా చేయవలసి వస్తున్నదని చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానెల ఎక్స్‌పీరియన్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని పాంటింగ్ వ్యక్తం చేశాడు. టీమ్ మెంబర్స్‌ను ఫిజికల్‌గా, మెంటల్‌గా సంసిద్ధం చేస్తున్నామని తెలిపాడు. బయో బబుల్ నిబంధనలను కఠినంగా పాటిస్తున్నామని వివరించాడు.