AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీపై కేంద్రానికి కేసీఆర్ సహా ఆరు రాష్ట్రాల సీఎంల లేఖ

జీఎస్టీ పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆరు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2.35 లక్షల కోట్ల తగ్గుదల ఏపడిందని, అందువల్ల రాష్ట్రాలకు..

జీఎస్టీపై కేంద్రానికి  కేసీఆర్ సహా ఆరు రాష్ట్రాల సీఎంల లేఖ
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 02, 2020 | 6:22 PM

Share

జీఎస్టీ పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆరు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2.35 లక్షల కోట్ల తగ్గుదల ఏపడిందని, అందువల్ల రాష్ట్రాలకు  జీఎస్టీ చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల చెప్పారు. 2021 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్టీ ‘షార్ట్ ఫాల్’ 97 వేల కోట్లని కూడా అన్నారు. అయితే జీఎస్టీ ‘సంక్షోభం’పై తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ కేంద్రానికి రాసిన లేఖలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చెల్లింపుల్లో మీ రాజ్యాంగబధ్ధ బాధ్యతలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. తమ బకాయిలు తీర్చుకోవాలంటే రాష్ట్రాలు రీ-పే మెంట్ మార్గాలను ఎంచుకోవాలన్న సూచనను వారు వ్యతిరేకిస్తూ జీ ఎస్టీ అమలులోకి వఛ్చిన మొదటి ఐదేళ్లలో రాష్ట్రాల రెవెన్యూ లోటును తీర్చే చట్టబధ్ధ బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాష్ట్రాలు రుణాల కోసం వెళ్తే వాటి ఆర్ధిక వనరులపై అదనపు భారం పడుతుందన్నారు.

కేంద్రం ఈ భారాన్ని తనపై వేసుకుని రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలని వారు కోరారు. అసలు ఈ సమస్య ఒకవిధంగా ‘విశ్వాస ఉల్లంఘన’ (ద్రోహపూరితమైనదిగా) గా మమతా బెనర్జీ అభివర్ణించారు. 2013 డిసెంబరులో మీ బీజేపీ జీ ఎస్టీ ని వ్యతిరేకించలేదా ? అప్పటి ప్రభుత్వాన్ని మీరు విశ్వసించలేకపోవడమే ఇందుకు కారణం కాదా ? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు మీ ప్రభుత్వంపై మేం విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు అదే పదాలు మా చెవుల్లో గింగురుమంటున్నాయి అని ఆమె వ్యాఖ్యానించారు.   రాష్ట్రాల కన్నా కేంద్రం తక్కువ  వడ్డీతో రుణాలు పొందగలదని ఆమె అన్నారు. మమతా బెనర్జీ అభిప్రాయాలతో ఏకీభవించిన కేసీఆర్.. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తాము జీ ఎస్టీకి మద్దతునిచ్చామని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్ ద్వారా కేంద్రం 2 లక్షల కోట్లను సంపాదించిందని, మరోవైపు పెట్రోలు, డీసెల్ పై వ్యాట్ ను పెంచడం ద్వారా రాష్ట్రాలను మాత్రం ‘ఖాళీ’ చేసిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.