నాన్నకు ప్రేమతో.. బన్నీ ‘పద్మశ్రీ’ డిమాండ్!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా లాస్ట్ సినిమాలు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ తర్వాత ఒక కోరిక వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఒక సరదా చిత్రం చేయాలని అనుకున్నాను. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి స్క్రిప్ట్ పూర్తి చేయడానికి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి […]

నాన్నకు ప్రేమతో.. బన్నీ 'పద్మశ్రీ' డిమాండ్!
Follow us

|

Updated on: Jan 07, 2020 | 5:48 PM

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నా లాస్ట్ సినిమాలు ‘సరైనోడు’, ‘డీజే’, ‘నా పేరు సూర్య’ తర్వాత ఒక కోరిక వచ్చింది. నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఒక సరదా చిత్రం చేయాలని అనుకున్నాను. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి స్క్రిప్ట్ పూర్తి చేయడానికి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంత టైం పట్టిందన్నారు.

ఒకప్పుడు నా శ్రీమతితో మ్యూజికల్ బ్యాండ్స్ దగ్గరకు వెళ్లాను… ఇక అప్పటి నుంచి నా సినిమాలో కూడా ఉండాలని అనుకున్నాను. అలా నిజం చేసిన సాంగ్ ‘సామజవరగమన’. ఈ పాట బాగుందని అందరం అనుకున్నాం గానీ.. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదన్నారు. సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాటను ఉద్దేశించి.. పొగిడిందని.. అప్పుడు అనిపించింది ‘ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కంటే.. పెళ్ళాం ముందు వచ్చే హీరోయిజంలో ఒక కిక్కు ఉంటుంది. ఇక ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

తమన్‌కు, నాకు ఇది హ్యాట్రిక్ ఆల్బం అని.. పాటలు అద్భుతంగా ఇచ్చాడని పొగిడారు. ఈ సినిమాలో పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎంతో కష్టపడి పబ్లిసిటీ ప్లానింగ్ చేసి..  ‘రాములో రాములో’ సాంగ్‌కు హాఫ్ కోట్ స్టెప్ అని హ్యాష్ ట్యాగ్ ఇస్తే.. నా కూతురు మాత్రం ‘నాన్న.. దోశ స్టెప్ వేస్తున్నాడని చెప్పిందని చమత్కరించారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతూ.. మూడు సార్లు ఆయనతో పనిచేశానంటే.. అది నాకు ఆయన మీద ఇష్టమే.  ఇక నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే.. త్రివిక్రమ్ గారే కారణమని చెప్పారు. నా ప్రతీ కోరికను..  నా ప్రతీ ఇష్టాన్ని ఈ సినిమాలో ఆయన ఇంటరెస్ట్ పెట్టి చూపించారు. ఇక ఈ చిత్రం ఎంత పేరు తెచ్చుకున్నా.. దానికి త్రివిక్రమ్ గారే కారణం.

దాదాపు 10 సినిమాలు మా నాన్నగారితో కలిసి పని చేశాను. ఇప్పటివరకు మా డాడీకి సభా ముఖంగా థాంక్స్ చెప్పలేదు. అందుకే ఇప్పుడు చెబుతున్నానని.. ‘ధన్యవాదాలు’ చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అంతేకాకుండా గతంలో అల్లు అరవింద్‌పై వచ్చిన రూమర్స్ అన్నింటిని ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేశారు. సుమారు 50 సినిమాలు పైగానే నిర్మించిన మా నాన్నకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్పిన బన్నీ.. ఒక గొప్పోడి పేరు మీరు టాటూ వేసుకున్నానని అనిపించుకునే వరకు ముందుకు వెళ్తూ ఉంటానని అన్నారు. కాగా, మెగాస్టార్ అంటే తనకు ప్రాణమన్న బన్నీ.. సంక్రాంతికి రిలీజయ్యి.. ‘దర్బార్’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘ఎంత మంచివాడువురా’కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!