క్లాస్ + మాస్ = ‘స్టైలిష్ స్టార్’ స్వాగ్
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ఈ లుక్‌ను పోస్ట్ చేసి ‘ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ఏవీపీఎల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్టర్‌లో అటు మాస్‌ను.. ఇటు క్లాస్‌ను ఒకే ఫ్రేమ్‌లో త్రివిక్రమ్ […]

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ఈ లుక్‌ను పోస్ట్ చేసి ‘ఫస్ట్ పోస్టర్ ఆఫ్ ఏవీపీఎల్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్టర్‌లో అటు మాస్‌ను.. ఇటు క్లాస్‌ను ఒకే ఫ్రేమ్‌లో త్రివిక్రమ్ చూపించడం విశేషం.
బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంటే.. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా రీసెంట్‌గా రిలీజైన డైలాగ్ ప్రోమో వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Here’s #AlaVaikunthapuramuloPoster!! @alluarjun #Trivikram @hegdepooja #Tabu #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil @MusicThaman #PSVinod @GeethaArts @haarikahassine @vamsi84 pic.twitter.com/2INrwuRjaR
— BARaju (@baraju_SuperHit) September 1, 2019