ఎలిమినేట్ అయ్యేది ‘ఆమె’.. వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సస్పెన్స్!
తెలుగునాట సెన్సేషనల్ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి క్షణానికి ఓ ట్విస్ట్ బయటికి వస్తోంది. బర్త్‌డే బాష్ సందర్భంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అందుకు గానూ ఆయన ప్లేస్‌లో శివగామి రమ్యకృష్ణ రంగంలో వచ్చారు. వీకెండ్ మొదటి రోజున వచ్చీరాగానే కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించి.. అభిమానులను తెగ అలరించారు. ఇవాళ అనగా ఆదివారం ఎలిమినేషన్స్ డే.. ఇప్పటికే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న […]
తెలుగునాట సెన్సేషనల్ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి క్షణానికి ఓ ట్విస్ట్ బయటికి వస్తోంది. బర్త్‌డే బాష్ సందర్భంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అందుకు గానూ ఆయన ప్లేస్‌లో శివగామి రమ్యకృష్ణ రంగంలో వచ్చారు. వీకెండ్ మొదటి రోజున వచ్చీరాగానే కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించి.. అభిమానులను తెగ అలరించారు.
ఇవాళ అనగా ఆదివారం ఎలిమినేషన్స్ డే.. ఇప్పటికే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రోజు ఎలిమినేషన్స్ ఉంటాయని ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అటు హిమజ అనధికారికంగా ఎలిమినేట్ అయిందని సమాచారం. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఈ ఊహాగానాలు నిజమనే చెబుతోంది.
మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శ్రద్ధా దాస్, హెబ్బా పటేల్ లేదా సింగర్ నోయల్ ఈ వారంలో గానీ వచ్చే వారం గానీ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారని ఇన్‌సైడ్ టాక్. చూడాలి మరి అసలు ఇందులో నిజమెంతో..?
#Sivagami @meramyakrishnan tho Sunday Funday..Rechipoina housemates ?? #BiggBossTelugu3 Today at 9 PM on @StarMaa pic.twitter.com/QYWuF38JDw
— STAR MAA (@StarMaa) September 1, 2019