AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగ్ బర్త్‌డే గిఫ్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.?

కింగ్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ దూకుడు… మొదటి రెండు సీజన్ల కంటే అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ బుల్లితెరపై దూసుకుపోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్‌కు ఓ పక్క గొడవ పడుతూనే.. ఎవరికి వారు తమదైన శైలిలో ఆట ఆడుతున్నారు. ఇకపోతే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య ప్రేమ.. అటు వరుణ్, […]

నాగ్ బర్త్‌డే గిఫ్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.?
Ravi Kiran
|

Updated on: Sep 01, 2019 | 8:52 AM

Share

కింగ్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ దూకుడు…

మొదటి రెండు సీజన్ల కంటే అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ బుల్లితెరపై దూసుకుపోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. హౌస్‌లో కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్‌కు ఓ పక్క గొడవ పడుతూనే.. ఎవరికి వారు తమదైన శైలిలో ఆట ఆడుతున్నారు. ఇకపోతే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య ప్రేమ.. అటు వరుణ్, వితికల మధ్య రొమాన్స్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

వీకెండ్స్ వీక్షకులకు ఎంజాయ్‌మెంట్…

మరోవైపు వీకెండ్స్ వస్తే చాలు నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. హద్దు మీరిన హౌస్‌మేట్స్‌కు క్లాస్ పీకుతూ.. సరదా గేమ్స్ ఆడిస్తే అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఐదు వారాలు ముగించుకుని.. ఆరో వారం చివరికి చేరుకున్న ఈ రియాలిటీ షోలో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మొదటివారం నటి హేమ, ఆ తర్వాత జాఫర్.. మూడోవారం తమన్నా సింహాద్రి.. వీరితో పాటు రోహిణి, అషురెడ్డిలు బయటికి వచ్చారు. ఆరోవారం గానూ పునర్నవి, మహేష్ విట్టా, హిమజలు ఎలిమినేషన్స్‌లో ఉన్నారు.

నాగ్ మిస్.. వీకెండ్ షురూ…

ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా నాగార్జున వచ్చి ఇంటి సభ్యులతో గేమ్‌లు వాటి మధ్యలో సేవ్ చేస్తూ చివరిగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ పేరు చెప్తాడని అందరూ భావించారు. కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు సందర్భంగా స్పెయిన్ ట్రిప్‌లో ఉండటంతో ఈ వారం షోలో నాగార్జున కనిపించరన్న విషయం తెలిసిందే.

‘బిగ్ బాస్’ సామ్రాజ్యానికి ‘కింగ్’ ప్లేస్‌లో ‘క్వీన్’ రాక…

ఇదిలా ఉంటే, నాగ్‌కు బదులు హోస్ట్‌గా రమ్యకృష్ణ వ్యవహరించారు. నిన్న సరదాగా హౌస్‌మేట్స్ అందరితోనూ గేమ్స్ కూడా ఆడించింది. ఇంతవరకూ బాగానే ఉంది. హోస్ట్‌గా వచ్చిన రమ్యకృష్ణ ఎలిమినేషన్ క్యాండిట్‌‌ను ప్రకటిస్తుందా.. అయితే ఎలిమినేట్ అయ్యేది ఎవరని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నో ఎలిమినేషన్.. ఓన్లీ ఎంజాయ్‌మెంట్ 

ఇకపోతే రమ్యకృష్ణ ఈ వారం హోస్ట్‌గానే వ్యవహరిస్తారని.. హౌస్‌లో నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్‌ను ప్రకటించారని తెలుస్తోంది. కేవలం నాగార్జున అందుబాటులో లేకపోవడంతోనే ఆమె షోను నడిపేందుకు మాత్రమే వచ్చారని సమాచారం. అంతేకాకుండా ఈ వారం ఎలిమినేషన్ కూడా ఉండదట. ఇవాళ ఎలిమినేషన్ నామినేషన్స్‌లో ఉన్న ముగ్గుర్ని కూడా సేవ్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ సీజన్లో ఎలిమినేషన్ లేకుండా సాగే వారం ఇదే. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు..
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట- దీని రహస్యం మీకు తెలుసా?
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
ప్రభాస్ స్వాగ్ అదిరిపోతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. మారుతి
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు! ఇదే చివరి ఛాన్స్
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే..
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!
2 సెకన్లలో 700 కిలో మీటర్ల స్పీడ్‌ అందుకున్న రైలు!