AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి తెచ్చిన లొల్లి.. రాజకీయ పార్టీల్లో కొత్త పంచాయితీ..!

ఉల్లి ధర కొండెక్కుతోంది. కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. అయితే ఉల్లి ధరలు పెరగటం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఉల్లి ధరలు పెరగటం వల్ల బీజేపీ అధికారాన్ని కూడా కోల్పోయింది. 2013 ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రధానంగా రైతులకు మేలు చేస్తా అని.. టమాటో, ఉల్లి, బంగాళదుంప నినాదాన్ని వినిపించారు. ఇప్పుడు తాజాగా ఉల్లి పై కొత్త లొల్లి స్టార్ట్ అయింది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. ఎప్పుడూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు […]

ఉల్లి తెచ్చిన లొల్లి.. రాజకీయ పార్టీల్లో కొత్త పంచాయితీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 10:31 PM

Share

ఉల్లి ధర కొండెక్కుతోంది. కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. అయితే ఉల్లి ధరలు పెరగటం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో ఉల్లి ధరలు పెరగటం వల్ల బీజేపీ అధికారాన్ని కూడా కోల్పోయింది. 2013 ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రధానంగా రైతులకు మేలు చేస్తా అని.. టమాటో, ఉల్లి, బంగాళదుంప నినాదాన్ని వినిపించారు. ఇప్పుడు తాజాగా ఉల్లి పై కొత్త లొల్లి స్టార్ట్ అయింది.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. ఎప్పుడూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ఉల్లి, టమాట ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయ, టమాట లేకుండా పూటగడవదు. ఇప్పుడు వాటి ధరలు విపరీతంగా పెరిగి ఉల్లి కోయకుండానే కంట నీరు తెప్పిస్తోంది. ఏవంటలోనైనా రెండు, మూడు ఉల్లిగడ్డలు వేయనిదే కూర రుచిరాదు. సుమారు నెల రోజుల క్రితం కిలో ధర రూ. 20నుంచి రూ.25 ఉన్న ఉల్లి ఇప్పుడు రూ.100కి పెరిగింది. పట్టణాలు, మండలకేంద్రాల్లో ఉల్లి నాణ్యతను బట్టి కిలో రూ.45 నుంచి రూ.50 అమ్ముతుండగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేసరికి వారికి రవాణా చార్జీలు పెరగడం, వారి లాభం చూసుకుని వ్యాపారులు కిలో రూ.50నుంచి రూ.60అమ్ముతున్నారు. దీంతో పెరిగిన ధరలతో కొనలేక, కొనకుండా ఉండలేక ప్రజలు సతమతమవుతున్నారు.

ఉల్లిపాయ ఒక ఆంటిబయోటిక్‌. దీనిని తినకపోయినా మన పక్కన ఉంచుకుంటే వైరస్‌, బాక్టీరియాలతో వచ్చే జబ్బులను దరిచేరనివ్వదు. కూరలో వాడటం కన్నా పచ్చి ఉల్లిపాయలు తినాలని అప్పుడు ఉల్లి చేసే మేలు ఏమిటో తెలుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఉల్లిపాయలో బాక్టీరియా, వైర్‌స్‌లకు కావాల్సి మాగ్నెట్‌ ఉంటుంది. ఆమాగ్నెట్‌ ఆకర్షణతో బాక్టీరియా, వైర్‌సలు ఉల్లిపాయలోకి వెళ్తాయి. అందులోకి వెళ్లాక ఆ ఉల్లిఘాటుకు అవి చనిపోతాయి. బాక్టీరియా, వైర్‌సలు చనిపోయిన ఉల్లిగడ్డ నల్లబడుతుంది.

వర్షాలతో పెరిగిన ధరలు హైదరాబాద్‌ మార్కెట్‌కు ఉల్లిగడ్డ ప్రధానంగా మహారాష్ట్ర, కర్నూలు నుంచి వస్తుంది. మహారాష్ట్రలో ఉల్లి సీజన్‌ ముగిసింది.  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల పేరు చెప్పగానే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున రైతులు ఉల్లిసాగు చేస్తారు. కానీ ఇక్కడి రైతులకు ఉల్లిగడ్డలు నష్టాలే మిగిలిస్తున్నాయి. సాధారణంగా ధర పెరిగితే రైతులు లాభపడాలి. కానీ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నా రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగడం లేదు. దీనికి కారణం జిల్లాలో ఈ సారి దిగుబడి తగ్గడమే. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో పెరిగిన ఉల్లిపాయ ధరలు చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక దీనికి తోడు వర్షాలు కూడా తోడవడంతో.. ఉల్లి తీయడం లేదంటున్నారు. దీంతో హైదరాబాద్ మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా రావడంలేదు. డిమాండ్‌ ఎక్కువగా ఉండి సరుకు తక్కువగా వస్తుండటంతో రేటు పెరుగుతున్నదని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమైతే ఇంకెంత పెరుగుతాయోనని పేద, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆఫ్గానిస్తాను నుంచి భారీగా ఉల్లి దిగుమతి చేసుకుంది. అయినా డిమాండ్‌కు తగినంత ఉల్లిగడ్డ నిల్వలు లేక పోవడం వలనే ధరలు పెరిగాయని చెబుతున్నారు. కాగా కొన్నిఉత్తరాది రాష్ట్రాల్లో ఉల్లి గడ్డ ధర కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర కొరత తీవ్రంగా ఉండడంతో కిలో 80 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతోంది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల నుంచి ఇతర దేశాలకు ఉల్లిగడ్డ తరలిపోతోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలకంటే మరింత ఎక్కువ ధరలు వస్తుండడంతో చాలా మంది వ్యాపారులు ఎగుమతుల పై ఆసక్తి చూపిస్తున్నారు. ఉల్లిగడ్డ ధరలు పెరిగినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా పెరిగిన ఉల్లిగడ్డ ధరలను నియంత్రంచేందుకు ఎగుమతులను నిషేధించాలని నిర్ణయించింది. దీంతో దేశంలో ఉన్న ఉల్లిగడ్డ నిల్వలు దేశంలోనే వినియోగం అయితే ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే అసలు ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం మొదటిది వరదలు, రెండవది రైతులు ఉల్లిని పండిచకపోవడం. ఈ కారణాలను పక్కన పెట్టి రాజకీయ పార్టీలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నాయమని బీజేపీ అంటుంటే.. మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.