Jallikattu: నేడు అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పాల్గొనున్న 1000 ఎద్దులు, 450 పోటీదారులు

Surya Kala

Surya Kala |

Updated on: Jan 17, 2023 | 9:14 AM

జల్లి కట్టు పోటీల్లో విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో జల్లికట్టు పోటీలపై తమిళనాడు సర్కార్ అప్రమత్తమయ్యింది. జల్లికట్టు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌ల సంఖ్యను మరింత పెంచింది. జల్లికట్టు పోటీల్లో మూడు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు.

Jallikattu: నేడు అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ప్రారంభం.. పాల్గొనున్న 1000 ఎద్దులు, 450 పోటీదారులు
Jallikattu

సంక్రాంతి అంటేనే సంస్సంకృతి , ప్రదాయాలకు నెలవు. తమిళనాడులో సాంప్రదాయ పోటీలు జల్లి కట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర సీఎం స్టాలిన్‌ ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ పోటీల్లో వెయ్యికి పైగా ఎద్దులు, 450 పోటీదారులు పాల్గొననున్నారు. మరోవైపు జల్లి కట్టు పోటీల్లో విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో జల్లికట్టు పోటీలపై తమిళనాడు సర్కార్ అప్రమత్తమయ్యింది. జల్లికట్టు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌ల సంఖ్యను మరింత పెంచింది. జల్లికట్టు పోటీల్లో మూడు రోజుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 80 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హమీనిచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నిన్న పాలమేడులో నిర్వహించిన పోటీల్లో అరవిందరాజు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎద్దు కొమ్ములు శరీరంలోకి కుచ్చుకోవడంతో తీవ్రగాయాల పాలైన అరవిందరాజును హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తిరుచ్చి జల్లికట్టులో మరో వ్యక్తి చనిపోయాడు. ఎద్దులు దూసుకురావడంతో గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu