Bachchan pandey movie update: అక్షయ్ ‘బచ్చన్ పాండే’ వచ్చేది ఆ స్పెషల్ రోజునే .. తేదీ ఫిక్స్ చేసిన మూవీ టీం..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'బచ్చన్ పాండే'. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ పోస్టర్‏ను విడుదల చేసింది

Bachchan pandey movie update: అక్షయ్ 'బచ్చన్ పాండే' వచ్చేది ఆ స్పెషల్ రోజునే .. తేదీ ఫిక్స్ చేసిన మూవీ టీం..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2021 | 8:00 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బచ్చన్ పాండే’. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే అక్షయ్ అతరంగీ రే, పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్రపై పృథ్వీరాజ్, రామ్ సేతు అనే సినిమాలు చేస్తున్నాడు. దీంతో ఈ ఏడాది ఫుల్ సినిమాలతో ప్రేక్ష‌కుల‌ని అలరించేందుకు రాబోతున్నాడు అక్షయ్.

తాజాగా ఈ బచ్చన్ పాండే మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. వచ్చే ఏడాది జనవరి 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పోస్టర్‏లో అక్షయ్ పిల్లి కన్నుతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇందులో కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండజ్‏లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో అర్షశద్ వార్సీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read:

Hero Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్.. ఈసారి రవితేజ డైరెక్టర్‏తో కలవనున్న జనసేనాని..

Srikaram Movie Update: శివరాత్రికి రానున్న శర్వానంద్ ‘శ్రీకారం’.. మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం..