Keerthi Suresh : దుబాయ్‌కి పయనమైన మహానటి.. మహేశ్‌తో ఆడిపాడేందుకేనా!.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..
Keerthi Suresh : సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో
Keerthi Suresh : సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో ప్లాన్ చేశారు చిత్రబృందం. దీంతో మహేశ్ ఫ్యామిలీ దుబాయ్‌కి చేరిపోయి సందడి చేస్తోంది. ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా దుబాయ్ బయలుదేరింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగులో కీర్తి ఈ సినిమాతో పాటు నితిన్‌కు జోడిగా ‘రంగ్‌దే’లో నటిస్తోంది. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కీర్తి ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 25న దుబాయ్‌లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్ అఫీషియల్‌గా మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు కీర్త సురేష్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
నితిన్ పై మహానటి పగ… ఎందుకో తెలుసా… ఇన్ స్టాలో పోస్టు… గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్