ఫ్రీ వ్యాక్సీన్ బీహార్ ప్రజలకేనా ? అకాలీదళ్ ఫైర్

తాము బీహార్ లో అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వ్యాక్సీన్ ఇస్తామంటూ బీజేపీ ఇఛ్చిన హామీపై అకాలీదళ్ మండిపడింది. ఎన్డీయే నుంచి వైదొలగిన ఈ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కమలం పార్టీని తీవ్రంగా తప్పు పడుతూ.. బీహార్ రాష్ట్రానికి మాత్రమే ఈ ఫ్రీ వ్యాక్సీన్ ఇస్తారా అని ప్రశ్నించారు. మొత్తం దేశ ప్రజలంతా పన్నులు చెల్లించడం లేదా అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఏ పాపం చేశారన్నారు. దేశానికంతటికీ […]

  • Umakanth Rao
  • Publish Date - 8:26 pm, Thu, 22 October 20
ఫ్రీ వ్యాక్సీన్ బీహార్ ప్రజలకేనా ? అకాలీదళ్ ఫైర్

తాము బీహార్ లో అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వ్యాక్సీన్ ఇస్తామంటూ బీజేపీ ఇఛ్చిన హామీపై అకాలీదళ్ మండిపడింది. ఎన్డీయే నుంచి వైదొలగిన ఈ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కమలం పార్టీని తీవ్రంగా తప్పు పడుతూ.. బీహార్ రాష్ట్రానికి మాత్రమే ఈ ఫ్రీ వ్యాక్సీన్ ఇస్తారా అని ప్రశ్నించారు. మొత్తం దేశ ప్రజలంతా పన్నులు చెల్లించడం లేదా అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఏ పాపం చేశారన్నారు. దేశానికంతటికీ టీకా మందు ఇవ్వాలన్నది ప్రభుత్వ విధిగా ఉండాలన్నారు. అటు కాంగ్రెస్, ఆప్, ఇతర విపక్షాలు కూడా బీజేపీ హామీని దుయ్యబట్టాయి.