Ajith Kumar Sign Forgery: సోషల్ మీడియాపై ఆసక్తి లేదు.. ఫ్యాన్ పేజీలకు సపోర్ట్ చేయనుః అజిత్
Ajith Kumar Sign Forgery: తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు ‘తలా’ అజిత్ కుమార్. ఇటీవల అజిత్ త్వరలోనే సోషల్ మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నట్లు నెట్టింట్లో ఓ నోటీసు ఆయన సంతకంతో హల్చల్ చేసింది. దీనిపై తాజాగా ఆయన లీగల్ టీమ్ స్పందించారు. ఆ నోటీసులో ఎంత మాత్రం నిజం లేదని.. అవన్నీ వట్టి పుకార్లేనని.. అందులో ఉన్న సంతకం కూడా అజిత్ […]
Ajith Kumar Sign Forgery: తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు ‘తలా’ అజిత్ కుమార్. ఇటీవల అజిత్ త్వరలోనే సోషల్ మీడియాలో అధికారిక ఖాతాను తెరవనున్నట్లు నెట్టింట్లో ఓ నోటీసు ఆయన సంతకంతో హల్చల్ చేసింది. దీనిపై తాజాగా ఆయన లీగల్ టీమ్ స్పందించారు.
ఆ నోటీసులో ఎంత మాత్రం నిజం లేదని.. అవన్నీ వట్టి పుకార్లేనని.. అందులో ఉన్న సంతకం కూడా అజిత్ కుమార్‌ది కాదని వారు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేశారు.
‘అజిత్ కుమార్ త్వరలోనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ నోటీసు శుక్రవారం నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. లెటర్ హెడ్‌తో పాటు అజిత్ సంతకం కూడా నకిలీవే. ఈ వార్తను చూసిన తర్వాత తమతో పాటు అజిత్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని’ అజిత్ లీగల్ టీమ్ స్పష్టం చేసింది.
అజిత్ కుమార్‌కు సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్ లేదు. ఆయన ఎలాంటి ఫ్యాన్ పేజీలకు కూడా సపోర్ట్ చేయరు. ఓ సెలబ్రిటీలా కాకుండా సామాన్య వ్యక్తిగా అజిత్ కుమార్ ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే మీడియాకు ఇంటర్వ్యూస్, ఈవెంట్స్‌కు కూడా ఆయన దూరంగా ఉంటారని లీగల్ టీమ్ వెల్లడించింది.
For More News:
మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…
నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త…
విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్.. ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్ సిద్ధం…
కరోనా ఎఫెక్ట్.. విరాట్ కోహ్లీకి భారీ షాక్.. అక్కడ మ్యాచులు రద్దు.?
ఇండియన్ ఉసేన్ బోల్ట్ అరుదైన ఘనత.. 46 మెడల్స్‌తో ఆల్ టైం రికార్డు..
తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు..
నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఈకో ఫ్రెండ్లీ ఫుడ్ జోన్..
కరోనా ఎఫెక్ట్.. దళపతి షాకింగ్ డెసిషన్… అభిమానులకు నిరాశేనా.?