కరోనా ఎఫెక్ట్: ‘నో’ ఫంక్షన్లు.. కేరళ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు..!
కేరళలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ 6 కేసులు బయటపడగా.. మంగళవారం ఒక్క రోజే మరో ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. 1116 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
కేరళలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ 6 కేసులు బయటపడగా.. మంగళవారం ఒక్క రోజే మరో ఆరు కేసులు వెలుగులోకి వచ్చాయి. 1116 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మార్చి ఆఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.
అలాగే ఈ నెల మొత్తం ప్రభుత్వపరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక పెళ్లిళ్ల విషయంలో.. ఇప్పటికే నిశ్చయమైనవి మాత్రమే చేయాలని.. అవి కూడా ఎంత తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని ఆయన అన్నారు. వీటితో పాటు మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నామని, వీటిపై ప్రజలు భయాందోళను గురికావాల్సిన పనిలేదని సీఎం పేర్కొన్నారు. కాగా కేరళ వ్యాప్తంగా పతనమిట్ట, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ప్రజలంతా బాధ్యతతో వ్యవహరిస్తే వైరస్‌ను ఎదుర్కోవడం సులభమేనని పినరయి ధీమా వ్యక్తం చేశారు. Read This Story Also: AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?