Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?

లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఏ20గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యనే ప్రారంభం కాగా.. త్వరలో ఈ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు బన్నీ.
AA 20 movie gossips, AA20:సేతుపతి కీ రోల్.. విలన్లుగా ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా..?

లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూడోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఏ20గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఆ మధ్యనే ప్రారంభం కాగా.. త్వరలో ఈ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు బన్నీ. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. ఈ మూవీలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆయనతో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దాలనుకుంటోన్న సుకుమార్.. కాస్టింగ్‌ను కూడా అలానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా సుకుమార్‌కు, జగపతిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాల్లో జగ్గు భాయ్‌కు గుర్తుండిపోయే పాత్రలను ఇచ్చారు సుకుమార్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి తన సినిమాలో విలన్‌గా ఆయన్నే ఎన్నుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. బన్నీకి జగపతి బాబు విలన్‌గా నటించడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక ఇందులో బన్నీ చిత్తూరుకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇందుకోసం రాయలసీమ యాసను కూడా నేర్చుకుంటున్నారట. అలాగే రష్మిక పల్లెటూరి యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించి ఇటీవలే లుక్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుక్కు- బన్నీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ప్రణయ్ హత్య కేసు విచారణ ఈ నెల 23కి వాయిదా..

Related Tags