Aha OTT: ‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..
Aha OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీలు ఇండియన్ డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. మై హోం గ్రూప్ సంస్థ భాగస్వామ్యంతో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ‘ఆహా’ ప్రివ్యూ లాంచ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ యాప్ […]
Aha OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీలు ఇండియన్ డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. మై హోం గ్రూప్ సంస్థ భాగస్వామ్యంతో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ‘ఆహా’ ప్రివ్యూ లాంచ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ యాప్ కొద్దిరోజుల్లోనే రికార్డు డౌన్‌లోడ్స్, రిజిస్ట్రేషన్స్ సాధించడం విశేషం.
ఈ యాప్ ప్రివ్యూను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే సుమారుగా 500k రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుని మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. ప్రస్తుతానికి 671k రిజస్ట్రేషన్ మార్క్‌ను సాధించింది. అటు సుమారు రెండు మిలియన్ యాక్టీవ్ యూజర్లు 36 నిమిషాల స్ట్రీమింగ్ సగటుతో 24,313,661 నిమిషాలు వీక్షించారు.
‘మస్తీస్’, ‘కొత్త పోరడు’, ‘షిట్ హప్పెన్స్’, ‘గీతా సుబ్రహ్మణ్యం 2020’ లాంటి వెబ్‌సిరీస్‌లతో పాటు అర్జున్ సురవరం, ఖైదీ, ప్రెషర్ కుక్కర్ వంటి ఫుల్ టూ మస్తీ ఎంటర్టైన్మెంట్‌కు ‘అహా’ కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. రౌడీ విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఈ యాప్ ఉగాది రోజున పూర్తిస్థాయిలో లాంచ్ కాబోతోంది. కాగా, ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు హాజరు కానున్నారు.
For More News:
మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?
బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీతో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్ ఫామ్‌తోనే జట్టులోకి..?
కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..
కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..
కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..