తుపాకీతో ఫోటో దిగబోయి.. ప్రాణాల మీదకు..

ఉత్తరప్రదేశ్‌లో సరదా కోసం తుపాకీతో ఫోటో దిగబోయి ఆగ్రాలోని జాన్వి అనే మహిళ చావు అంచుల వరకూ వెళ్లింది. అనుకోకుండా ట్రిగర్ నొక్కుకోవడంతో శరీరంలోకి తూటా పోయి ప్రాణాపాయస్థితికి చేరుకుంది. ఆగ్రాలోని దుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న జాన్వికి ఏడాది క్రితం విశ్వజిత్ తోమర్‌తో వివాహం జరిగింది. విశ్వజిత్‌ తండ్రి సుభాష్‌ తోమర్‌ సైన్యంలో విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయనకు సైన్యంలో ఉన్నందున లైసెన్స్‌డ్‌ తుపాకీ అందుబాటులో ఉంది. అయితే సుభాష్‌ తోమర్‌ ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్న విశ్వజిత్‌ని […]

తుపాకీతో ఫోటో దిగబోయి.. ప్రాణాల మీదకు..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 12, 2019 | 5:21 PM

ఉత్తరప్రదేశ్‌లో సరదా కోసం తుపాకీతో ఫోటో దిగబోయి ఆగ్రాలోని జాన్వి అనే మహిళ చావు అంచుల వరకూ వెళ్లింది. అనుకోకుండా ట్రిగర్ నొక్కుకోవడంతో శరీరంలోకి తూటా పోయి ప్రాణాపాయస్థితికి చేరుకుంది. ఆగ్రాలోని దుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న జాన్వికి ఏడాది క్రితం విశ్వజిత్ తోమర్‌తో వివాహం జరిగింది. విశ్వజిత్‌ తండ్రి సుభాష్‌ తోమర్‌ సైన్యంలో విధులు నిర్వర్తిస్తుంటారు. ఆయనకు సైన్యంలో ఉన్నందున లైసెన్స్‌డ్‌ తుపాకీ అందుబాటులో ఉంది. అయితే సుభాష్‌ తోమర్‌ ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్న విశ్వజిత్‌ని కలిసేందుకు వెళ్లే సమయంలో తుపాకీని ఇంట్లో పెట్టి వెళ్లారు. తుపాకీని చూసిన జాన్వి దానితో ఫోటో దిగాలని.. మేనకోడలు డాలీని ఫోటో తీయమని చెప్పింది. ఫోటోకు స్టిల్ ఇవ్వబోయి పొరపాటున ట్రిగర్ నొక్కడంతో ఆమె శరీరంలోకి తూటా దూసుకెళ్లింది. దీంతో రక్తపు మడుగులో ఉన్న జాన్విని చూసి డాలీ భయంతో అరవగా చుట్టుపక్కల వారంతా వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్‌ ఆమె గుండెకు దగ్గరగా దూసుకెళ్లడంతో ఊపిరితిత్తులు పాడయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.