బాలీవుడ్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు..

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్‌కి వస్తానని చెప్పి రెమున్యూరేషన్ కూడా తీసుకుని సోనాక్షి ఈవెంట్‌కి హాజరుకాలేదు. 2018లో సోనాక్షి సిన్హా ఓ ఈవెంట్‌లో స్టేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్ […]

బాలీవుడ్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు..
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 12, 2019 | 9:53 AM

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్‌కి వస్తానని చెప్పి రెమున్యూరేషన్ కూడా తీసుకుని సోనాక్షి ఈవెంట్‌కి హాజరుకాలేదు. 2018లో సోనాక్షి సిన్హా ఓ ఈవెంట్‌లో స్టేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకొని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యూపీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షిసిన్హా ఇంటికి వచ్చింది. పోలీసులు వచ్చినపుడు సోనాక్షిసిన్హా అందుబాటులో లేదు.

బీజేపీ మాజీ ఎంపీ అయిన సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు సోనాక్షి తల్లి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో తల్లి తరపున ఎన్నికల ప్రచారం చేసిన సోనాక్షిసిన్హా పై యూపీ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu