తహశీల్దార్ లావణ్య అరెస్ట్.. 14 రోజులు రిమాండ్

లంచం తీసుకుంటూ పట్టుబడిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీఆర్వో అనంతయ్యతో పాటు తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడం వల్ల లావణ్యను నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ తర్వాత ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం లావణ్యను, వీఆర్వో అనంతయ్యను బంజారాహిల్స్​లోని అనిశా […]

తహశీల్దార్ లావణ్య అరెస్ట్.. 14 రోజులు రిమాండ్
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 12, 2019 | 7:47 AM

లంచం తీసుకుంటూ పట్టుబడిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. వీఆర్వో అనంతయ్యతో పాటు తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించారు.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడం వల్ల లావణ్యను నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ తర్వాత ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం లావణ్యను, వీఆర్వో అనంతయ్యను బంజారాహిల్స్​లోని అనిశా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. 14 రోజుల రిమాండ్​ విధిస్తూ.. న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో.. నిందితులను చంచల్​గూడా జైలుకు తరలించారు.

లావణ్య ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరిచేందుకు నిబంధనలు మార్చి ఆమె రూ. 30 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే ఆ సంస్థ 30 లక్షలను ఆమెకు ముట్టజెప్పినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆమె పై మరో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

కేశంపేట తహశీల్దార్‌గా లావణ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం వల్ల, జూన్ నెలలో పదిమంది వీఆర్వోలు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వీఆర్వోలు విధుల్లో చేరినా.. తహశీల్దార్ మాత్రం పాతవారిని మాత్రం వేరే చోటికి పంపలేదు. కాగా, బదిలీ అయిన వారిలో వీఆర్వో అనంతయ్య కూడా ఉన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu