ఆఫ్ఘన్ అధ్యక్షుడి బంధువు దారుణ హత్య
ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తాలిబన్లు మాత్రమే ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ నేతలు, ఇతర..
ఆఫ్ఘనిస్థాన్‌లో రాజకీయ హత్యలు పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు తాలిబన్లు మాత్రమే ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎవరు చేస్తున్నారన్నది ఇక్కడ పెద్ద మిస్టరీగా మారింది. తాజాగా ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బంధువు ఒకరు హత్యకు గురయ్యారు. కాబుల్‌లోని ఆయన ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనకు కారణం ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
A cousin of Afghanistan President Ashraf Ghani found shot to death inside his home in Kabul: Afghanistan Media
— ANI (@ANI) July 4, 2020