బ్రేకింగ్: నిమ్స్‌లో కరోనా కలకలం…

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా నిమ్స్‌లోని టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

బ్రేకింగ్: నిమ్స్‌లో కరోనా కలకలం...
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 04, 2020 | 9:36 PM

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిమ్స్‌లోని టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మిలీనియమ్ బ్లాక్ నుండి ఐటీఎంఆర్ భవనానికి ల్యాబ్‌ను టెస్టుల ప్రక్రియ కోసం మార్చడంతో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

ఐటీఎంఆర్ భవనంలోనే  కరోనా నమూనాల సేకరణ, పరీక్షలు, కరోనా బాధితులకు చికిత్స జరుగుతుండటంతో ల్యాబ్ సిబ్బంది హైరిస్క్‌లో ఉన్నారు. కాగా, మిలీనియమ్ బ్లాక్‌లో అత్యంత సురక్షితమైన నెగటివ్ ప్రెజర్ రూమ్ సదుపాయం ఉండడంతో గడిచిన మూడు నెలలో ల్యాబ్ సిబ్బందిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. అయితే మైక్రోబయోలజీ ల్యాబ్‌ను నాలుగు రోజుల క్రితం నిమ్స్ అధికారులు ఐటీఎంఆర్ భవనంలోకి మార్చారు. దీనితో టెస్టింగ్ సిబ్బందికి ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో.. వారిలో ఆందోళన మొదలయ్యింది. కాగా, తెలంగాణలో తాజాగా 1850 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1572 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 5 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 22,312కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 288 మంది మృతి చెందారు.