ఏబీ ఆల్‌టైం ఐపీఎల్ టీమ్.. ఏడుగురు భారత్ ప్లేయర్స్‌కు చోటు..

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌, రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఫేవరేట్ అండ్ ఆల్‌టైం ఐపీఎల్ బెస్ట్ టీ‌మ్‌ను ప్రకటించాడు.

ఏబీ ఆల్‌టైం ఐపీఎల్ టీమ్.. ఏడుగురు భారత్ ప్లేయర్స్‌కు చోటు..
ఏబీ డివిలియర్స్
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 04, 2020 | 9:17 PM

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌, రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఫేవరేట్ అండ్ ఆల్‌టైం ఐపీఎల్ బెస్ట్ టీ‌మ్‌ను ప్రకటించాడు. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఓ సీనియర్ ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన ఏబీ.. తన టీమ్‌లో ఏకంగా ఏడుగురు ఇండియన్ ప్లేయర్స్‌కు చోటు కల్పించాడు. భారత జట్టు సీనియర్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకోగా.. విరాట్ కోహ్లీ, ధోని, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, బుమ్రాలను జట్టులో చోటు కల్పించాడు. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి జట్టు పగ్గాలు అప్పగించాడు.

ఏబీ ఆల్‌టైం ఐపీఎల్ టీమ్: ధోని(వికెట్ కీపర్, కెప్టెన్), సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రబాడ, బుమ్రా